గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:28:26

మహిళా రక్షణలో మనమే టాప్‌

మహిళా రక్షణలో మనమే టాప్‌
  • నిరంతరం అందుబాటులో 300 షీటీంలు: హోంమంత్రి మహమూద్‌అలీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళా రక్షణలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలువడం సంతోషదాయకమని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రతలో 300 షీటీమ్స్‌ నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, రాచకొండ సైబర్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ కార్యదర్శి సతీశ్‌ వడ్లమాని, మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజీపూర్‌ గ్రామ బాలికలకు హోంమంత్రి సైకిళ్లను అందజేశారు. పలువురిని సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.


logo
>>>>>>