శనివారం 06 జూన్ 2020
Telangana - May 06, 2020 , 20:18:58

ఫార్మా రంగానికి మద్దతు కోరుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

ఫార్మా రంగానికి మద్దతు కోరుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌ : ఫార్మా రంగానికి చేయూత అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రి సదానంద గౌడకు బుధవారం లేఖ రాశారు. నూతన ఫార్మాసూటికల్స్‌ విధానాన్ని తీసుకురావాల్సిందిగా లేఖలో మంత్రి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మద్యతరహా ఫార్మా కంపెనీలకు సహకారం అందించాలన్నారు. ముడిసరుకుల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలన్నారు. కోవిడ్‌-19 సంక్షోభంలో ఫార్మా రంగానికి అందించాల్సిన చేయూత, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్కరణలపై మంత్రి కేంద్రానికి లేఖ ద్వారా పలు సూచనలు చేశారు. కేంద్ర మద్దతు ఈ రంగాన్ని స్థిరీకరించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొత్త పెట్టుబడులను ఆకర్షించి భారతదేశ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్నారు.


logo