సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 02:19:45

ప్రభుత్వానికి సహకరించండి

ప్రభుత్వానికి సహకరించండి

  • టీఎన్జీవో నూతన అధ్యక్షుడితో మంత్రి కేటీఆర్‌
  • మామిళ్ల రాజేందర్‌ బాధ్యత పెరిగిందని వ్యాఖ్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్‌: ప్రస్తుత పరిస్థితులను అర్థంచేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని  మంత్రి కే తారకరామారావు ఉద్యోగులను కోరారు. టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌.. మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్‌ను కేటీఆర్‌ అభినందించారు. ఇప్పుడు రా జేందర్‌ బాధ్యత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. సుదీర్ఘకాలం టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి కారం రవీందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మా మిళ్ల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్‌ చెప్పారని తెలిపారు. త్వరలో సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటుచేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్‌ను కలిసినవారిలో టీఎన్జీ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.

సీఎస్‌ను కలిసిన మామిళ్ల

టీఎన్జీవో నేతలు గురువారం బీఆర్కేభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్‌ను సీఎస్‌ అభినందించారు. సీఎస్‌ను కలిసినవారిలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కొండల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, హైదరాబాద్‌ నగర అధ్యక్షులు రాయకంటి ప్రతాప్‌, కార్యదర్శి శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.


logo