బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 11:12:39

చ‌ట్ట‌స‌భ‌ల్లో అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం : కేటీఆర్

చ‌ట్ట‌స‌భ‌ల్లో అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం : కేటీఆర్

హైద‌రాబాద్ :  చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కివే మా కృత‌జ్ఞ‌త‌ల‌ని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్ర‌జాక‌వి గోరెటి వెంక‌న్న‌, బ‌స్వ‌రాజు సార‌య్య‌, బొగ్గార‌పు ద‌యానంద్‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌ స్పందిస్తూ.. తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికివే త‌న శుభాకాంక్షలు అన్నారు. 

రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇదన్నారు. గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్నను సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్‌కు వంద‌నాలన్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మాజీ మంత్రి, అత్యంత వెనుకబడిన రజక సామాజికవర్గం నుండి ప్రజానేతగా ఎదిగిన నాయకుడు బస్వరాజు సారయ్య, సంఘసేవకులు, ఆర్యవైశ్య ప్రతినిధి భోగార‌పు ద‌యానంద్‌కు ఇవే మా అభినంద‌న‌ల‌న్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.