సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:33

ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

  • గవర్నర్లు సహా మంత్రులు, ప్రముఖల విషెస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రికి లేఖ రాసిన సీఎం.. తర్వాత ఫోన్‌చేసి ప్రత్యేకంగా విషెస్‌ చెప్పారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఎర్రబెల్లికి ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలంపాటు ప్రజాజీవితంలో కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం, స్పీకర్‌ ఆకాంక్షించారు. మంత్రి దయాకర్‌రావుకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ట్విట్టర్‌లో విషెస్‌ చెప్పారు. 

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. మాజీ గవర్నర్లు కొణిజేటి రోశయ్య, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, డాక్టర్‌ రంజిత్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, జీవన్‌రెడ్డి, గాదరి కిశోర్‌, బాల్క సుమన్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, సినీ గేయరచయిత చంద్రబోస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.  

ఎర్రబెల్లి గ్రీన్‌ చాలెంజ్‌

‘మీ పుట్టిన రోజున మరో మూడు మొక్కలకు జీవం పోస్తే ఎలా ఉంటుంది? అంటూ ట్విట్టర్‌లో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌చాలెంజ్‌పై మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన, మొక్కలునాటిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.


logo