శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 22:38:59

రేపు ఎల్‌బీ నగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

రేపు ఎల్‌బీ నగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నగరంలో మంత్రి కేటీఆర్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. గత ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించిన కేటీఆర్‌.. ఈ సారి అంతకుమించి అద్భుత విజయాన్ని అందించేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రచారానికి ఇంకా వారంరోజులు మాత్రమే ఉండటంతో నగరంలో 20 నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లకు చేరువయ్యేలా పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు.

సోమవారం మంత్రి కేటీఆర్‌ ఎల్‌బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్‌ షోల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో రోడ్డు షోల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. జనం ప్రభంజనంలా తరలివచ్చి కేటీఆర్‌ ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా విన్నారు. ప్రచారంలో ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ.. ఓటర్లకు వాస్తవాలను వివరిస్తూ.. కేటీఆర్‌ ఓటు అభ్యర్థిస్తున్న తీరు జనాన్ని విశేషంగా ఆకర్షించింది.