బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 18:30:01

రేపు ఉదయం మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

రేపు ఉదయం మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ర్టానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో రేపు ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని అందుకుంద‌ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ అంత‌కుక్రితం ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నానన్నారు. వ‌న్‌ప్ల‌స్ ఇండియా టీమ్‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లోనే వ‌న్‌ప్ల‌స్ స్టోర్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.