సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 14:39:10

అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మేడ్చల్ : ‘గిఫ్ట్ ఏ స్మైల్’  కార్యక్రమంలో భాగంగా ప్రగతి భవన్ లో కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తరఫున సమకూర్చిన కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిప్టులు వద్దు, పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని ఇచ్చిన పిలుపుకు మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 

ప్రజల శ్రేయస్సు కోసం కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ఇటీవలే ప్రభుత్వానికి సమకూర్చారు. కార్యక్రమంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo