ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 17:56:16

అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’  కార్యక్రమం రోజురోజుకు ఊపందుకుంటున్నది. మంత్రి కేటీఆర్ పిలుపుతో సామాజిక సేవలో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులు పోటీపడి ముందుకొస్తున్నారు. పేదలను ఆదుకునేందుకు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను  

సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. పాలకుర్తి కి 2, వర్ధన్నపేటకి 2, ములుగు 1, భూపాలపల్లి 1, పరకాల 1, వరంగల్ పశ్చిమ 1, వరంగల్ తూర్పు 1, జనగామ 1 చొప్పున అందజేశారు. అంబులెన్సులను అందజేసిన ఆయా ఎమ్మెల్యేలను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి అభినందించారు.logo