బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 11:31:26

పంచతత్వ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

పంచతత్వ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌లో నిర్మించిన పంచతత్వ పార్క్‌ను మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్..‌  పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో‌ కలిసి‌ ఆదివారం ప్రారంభించారు. ఈ పార్కులో ఎనిమిది బ్లాకుల్లో ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. 

కంకరరాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో ట్రాక్‌ నిర్మాణం చేపట్టారు.  నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడేలా ట్రాక్‌ నిర్మాణం ఉంది.  ట్రాక్‌ సర్కిల్ మధ్యలో ఉధ్యావనశాఖ వివిధ రకాల ఔషధ మొక్కలు పెంచింది. వాకర్స్‌కు ఇవి ఆరోగ్యంతోపాటు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నాయి. నేటి నుంచి పార్క్‌ అందుబాటులోకి రానుంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.