బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 16:30:42

రాబోయే రెండు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండండి : కేటీఆర్

రాబోయే రెండు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండండి : కేటీఆర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ముంపు బాధితుల స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ ఓపిక‌గా అడిగి తెలుసుకుంటున్నారు. ముసారాంబాగ్‌లోని స‌లీంన‌గ‌ర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కేటీఆర్ ప‌ర్య‌టించి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వానలు త‌గ్గే సూచ‌న లేదు. ఇప్పుడు ఎక్క‌డైతే పున‌రావాస కేంద్రాల్లో ఉన్నారు.. మ‌రో రెండు రోజుల పాటు కూడా అక్క‌డే ఉండాల‌ని ముంపు బాధితుల‌కు కేటీఆర్ సూచించారు. బాధితులంద‌రికి వైద్య ప‌రీక్ష‌లు చేయించి, మందులు ఇస్తామ‌న్నారు. భోజ‌నం పెడుతామ‌న్నారు. దుప్ప‌ట్లు కూడా స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. వీటితో పాటు న‌ష్ట ప‌రిహారం కూడా చెల్లిస్తామ‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు. 

వీడియోల కోసం క్లిక్‌  చేయండి.. 

హైదరాబాద్‌లో పరవళ్లు తొక్కుతున్న మూసీ..

చరిత్రలో ఎన్నడూ లేనంతగా మూసీకి వరద..

హుస్సేన్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద.


logo