గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:33

13న పాలమూరుకు మంత్రి కేటీఆర్‌ రాక

13న పాలమూరుకు మంత్రి కేటీఆర్‌ రాక

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 13న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి మాట్లాడారు. ఎదిరలోని ప్రభుత్వ వైద్య కళాశాల, బైపాస్‌ రహదారి, వీరన్నపేటలోని డబుల్‌బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాలతోపాటు మయూరీ ఫారెస్టులో మియావాకీ అడవుల పెంప కం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారన్నారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ మండలం దివిటిపల్లి డబుల్‌ బెడ్రూం ఇండ్ల ఎదుట మొక్కలు నాటారు. 


logo