శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 17:33:46

ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : మ‌ంత్రి కేటీఆర్

ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : నాగోల్‌లోని అయ్యప్పనగర్ వద్ద వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10,000ల చొప్పున మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ చెరువుకు నీళ్లు పోయేలా ప‌రిపూర్ణ‌మైన డ్రైనేజీ నిర్మిస్తామ‌న్నారు. చెరువు నుంచి కింద‌కు మూసీ న‌దిలోకి నీళ్లు వెళ్లేందుకు కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ ప‌నుల కోసం ఎన్ని కోట్ల రూపాయాలు అయినా ఖ‌ర్చు పెడుతామ‌న్నారు. రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయినా వెనుకాడ‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాంతంలోని ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతామ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.


తాత్కాలికంగా త‌క్ష‌ణ సాయం కింద రూ. 10 వేల చొప్పున అందిస్తున్నాం.. భ‌విష్య‌త్‌లో కూడా అండ‌గా ఉంటామ‌న్నారు. పాక్షికంగా, పూర్తిగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌ను అధికారులు ప‌రిశీలించి ప్ర‌భుత్వానికి నివేదిక అందజేస్తారు. ద‌స‌రా త‌ర్వాత ఆ సాయాన్ని అందిస్తామ‌న్నారు. పున‌రావాస కేంద్రాల్లో ఉన్న ప్ర‌జ‌లు, కాల‌నీల్లో ఉన్న వారు అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని కేటీఆర్ కోరారు. ప్ర‌తి ఇంటికీ ఆర్థిక సాయం అందుతుంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా, భ‌ద్రంగా ఉండాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.