గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 11:17:24

ఖైర‌తాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

ఖైర‌తాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఖైర‌తాబాద్‌లోని బీఎస్ మ‌క్తా కాల‌నీలో శుక్ర‌వారం ఉద‌యం కేటీఆర్ ప‌ర్య‌టించి.. వ‌ర‌ద బాధితుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్ట‌ర్ హోమ్‌ని కేటీఆర్ ప‌రిశీలించి.. అక్క‌డ అందిస్తున్న సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. ప్ర‌స్తుతం వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌డ‌టంతో.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అధికారుల‌కు కేటీఆర్ సూచించారు. ముంపు బాధితులంద‌రికి రేష‌న్ బియ్యంతో పాటు ఇత‌ర నిత్య‌వ‌స‌రాలు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గోరు వెచ్చని నీటిని తాగాల‌ని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ సూచించారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య స‌దుపాయాన్ని అందిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. షెల్ట‌ర్ హోమ్‌లో ఉంటున్న వారికి ఆహారంతో పాటు దుప్ప‌ట్లు అందిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 


logo