సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 11:21:44

గ‌గ‌న్‌ప‌హాడ్ మృతుల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

గ‌గ‌న్‌ప‌హాడ్ మృతుల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్‌లో పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శ‌నివారం ఉద‌యం పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితులతో పాటు మృతుల కుటుంబ స‌భ్యుల‌ను కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. గ‌గ‌న్‌ప‌హాడ్‌, అలీన‌గ‌ర్‌లో వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో చ‌నిపోయిన కుటుంబ స‌భ్యుల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ చెక్కులు అంద‌జేశారు. గ‌గ‌న్‌ప‌హాడ్‌లో బుధ‌వారం ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు గ‌ల్లంతు అయ్యారు. గ‌ల్లంతైన వారిలో ముగ్గురి మృత‌దేహాలు ల‌భ్యం కాగా, మ‌రో వ్య‌క్తి మృత‌దేహం కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. అలీన‌గ‌ర్‌లో గ‌ల్లంతైన వారి కుటుంబ స‌భ్య‌ల‌ను కూడా ప‌రామ‌ర్శించారు. అలీన‌గ‌ర్‌లో గ‌ల్లంతైన 8 మందిలో ఐదుగురి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. 

మంత్రి కేటీఆర్ వెంట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక ప్రజాప్ర‌తినిధులు ఉన్నారు.


logo