గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 13:27:32

10 వేల ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్న మంత్రులు

10 వేల ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్న మంత్రులు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు మంత్రులు అంద‌జేస్తున్నారు. ఉప్ప‌ల్ నాలా చెరువు వ‌ద్ద చేప‌ట్టిన మ‌ర‌మ్మ‌తుల‌ను కేటీఆర్ ప‌రిశీలించారు.

బోడుప్ప‌ల్‌లో కేటీఆర్..

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపుకు గురైన ప్రజలను కలిసి, వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 ఆర్ధిక మంత్రులు కేటీఆర్, మ‌ల్లారెడ్డి అంద‌జేశారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను పరిశీలించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. 

బేగంపేట‌లో త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

భారీ వ‌ర్షాల‌కు ముంపున‌కు గురైన బేగంపేట‌లోని బ్ర‌హ్మ‌ణ‌వాడిలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప‌ర్య‌టించారు. వ‌ర‌ద బాధితుల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల త‌రుణి, అధికారులు పాల్గొన్నారు.