శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Oct 19, 2020 , 17:17:51

నాయిని న‌ర్సింహారెడ్డికి మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

నాయిని న‌ర్సింహారెడ్డికి మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్ : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరారు. 

గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ దవాఖానకు తరలించారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.


logo