గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 19:50:04

తెలంగాణ పరిశ్రమలశాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల

తెలంగాణ పరిశ్రమలశాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్‌ : పరిశ్రమలశాఖ వార్షిక ప్రగతి నివేదిక (2019-20) ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి మంగళవారం విడుదల చేశారు. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 35 శాతంగా ఉంది. జాతీయ జీఎస్‌డీపీ సగటుతో పోల్చుకుంటే 8.2 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. గతేడాది జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 4.55 శాతం ఉండగా ఈ ఏడాది 4.76 శాతంగా నమోదైంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు అయింది. 

తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,28,216గా ఉంది. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 నుంచి 11.58 శాతానికి పెరిగింది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయి. ఇప్పటివరకు 12,021 పరిశ్రమలు అనుమతులు పొందాయి. ఈ పరిశ్రమల్లో 75 శాతానికిపైగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఆఫీస్‌ స్పేస్‌ వినియోగిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ తొలిస్థానంలో ఉంది. logo