పీఆర్టీయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తెలంగాణ స్టేట్ సంఘ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్రసంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోయే నూతన సంవత్సరంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకన్నా ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, అంతర్జిల్లా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని, పీఆర్సీ నివేదికను అమలుపరచాలని సంఘం నాయకులు కోరారు. ఈ అంశాలపై రెండు మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్ సమక్షంలో సమావేశం ఉంటుందని సానుకూల నిర్ణయాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.