సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 15:24:42

ప్ర‌పంచంలోనే అతిపెద్ద బుద్ధ‌ వ‌నం.. కేటీఆర్ ట్వీట్

ప్ర‌పంచంలోనే అతిపెద్ద బుద్ధ‌ వ‌నం.. కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద నిర్మిస్తున్న బుద్ధ‌వ‌నం ప్రాజెక్టుపై రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బౌద్ధ వార‌స‌త్వ థీమ్ పార్క్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పార్కును 275 ఎక‌రాల్లో నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ బుద్ధ వ‌నంలో మ‌ఠాలు, ఎకో టూరిజం రిసార్టులు, ఫుడ్ పార్కుల‌తో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌నున్నారు. 

బౌద్ధంలోని మహాయానం పుట్టిన గడ్డ నాగార్జునసాగర్‌ను ప్రపంచపటంలో నిలిపేలా రూ. 100 కోట్ల వ్యయంతో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 15వ తేదీలోగా పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలోని తన చాంబర్‌లో నాగార్జునసాగర్‌లో నిర్మాణంలో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.