శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 07:45:35

నేడు మేడ్చ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న కేటీఆర్

నేడు మేడ్చ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న కేటీఆర్

హైద‌రాబాద్‌: రాష్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మేడ్చ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంటును మంత్రి ప్రారంభిస్తారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌కు చెక్‌పెట్టేందుకు జీడిమెట్ల‌లో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్‌ ప్లాంటు‌ను  జీహెచ్ఎంసీ నిర్మించింది. దీనిద్వారా ఇసుక కంక‌ర‌ను వివిధ ప‌రిమాణాల్లో వేరుచేయ‌నుంది. వాటిని వివిధ అవ‌స‌రాల‌కోసం మ‌ళ్లీ వినియోగించే అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప‌రీశీలిస్తారు.