ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 01:59:37

17న వరంగల్‌కు మంత్రి కేటీఆర్‌

 17న వరంగల్‌కు మంత్రి కేటీఆర్‌

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ:ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 17 వరంగల్‌లో పర్యటిస్తారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన వేదికల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి శనివారం వరంగల్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడు తూ రూ.650కోట్ల విలువైన పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని, అనంతరం అభివృద్ధి పనులపై సమీక్షిస్తారని వివరించారు. 


logo