శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 20:19:14

రేపు దుర్గంచెరువు కేబుల్‌ వంతెనను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

రేపు దుర్గంచెరువు కేబుల్‌ వంతెనను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వంతెనను ప్రారంభించనున్నారు. కొద్ది రోజుల కిత్రమే దీని నిర్మాణం పూర్తయ్యింది.

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జీ అయిన దీని నిర్మాణానికి సుమారు 185 కోట్లు వెచ్చించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45ను ఐటీ కారిడార్‌ను ఈ వంతెన అనుసంధానం చేయనుంది. దీని పొడవు సుమారు 754.38 మీటర్లు కాగా ఆరు లైన్లు వెడల్పుతో నిర్మించారు.  పాదాచారులకు, సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసి లైటింగ్‌ రాత్రివేళ వంతెన అందాన్ని మరింత పెంచేలా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo