శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:30:30

శుభ్రతతో కరోనా కట్టడి

శుభ్రతతో కరోనా కట్టడి

  • ప్రధాని మోదీకి సేఫ్‌ హ్యాండ్‌ చాలెంజ్‌ విసిరిన కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాను తరిమికొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ విసిరిన సేఫ్‌హ్యాండ్‌ చాలెంజ్‌ను స్వీకరించిన మంత్రి కేటీఆర్‌.. శానిటైజర్‌తో చేతులు ఎలా కడుక్కోవాలో చూపిస్తూ వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా చైన్‌ను బ్రేక్‌ చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సేఫ్‌హ్యాండ్స్‌ చాలెంజ్‌లో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు హర్దీప్‌సింగ్‌ పూరి, పీయుష్‌గోయల్‌, సినీనటుడు అమితాబ్‌బచ్చన్‌, అమెరికన్‌ ఇంటర్నెట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మార్క్‌ బెనిఆఫ్‌కు చాలెంజ్‌ విసిరారు.


logo