శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:15:40

ఇక పట్టణ భగీరథపై ఫోకస్‌

ఇక పట్టణ భగీరథపై ఫోకస్‌

  • నిరంతరం నీటి నాణ్యతపై పర్యవేక్షణ
  • అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేట్టిన ‘మిషన్‌ భగీరథ’ దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అర్బన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. గ్రామాలతో పోల్చితే పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తాయని అన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా భగీరథ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు త్వరగా పూర్తయ్యేందుకు ఏవైనా ఇతర శాఖల అవసరాలు ఉన్నాయా? అని అడిగారు. అలాగే, అర్బన్‌ మిషన్‌ భగీరథ కింద సరఫరా అవుతున్న నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


logo