బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 15:28:31

హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నిధులు.. కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నిధులు.. కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించడంపై ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుపై హైదరాబాద్‌ ప్రజల తరపున ప్రభుత్వానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి, నాయకత్వంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ మారబోతుందన్నారు కేటీఆర్‌. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు, మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ఫ్రంట్‌ కోసం వినియోగించనున్నారు.  


logo