గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 16:03:37

జీహెచ్‌ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌

జీహెచ్‌ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌

హైదరాబాద్‌ : టీఎస్‌ బీపాస్‌(టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్‌)పై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ, పురపాలక, హెచ్‌ఎండీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 87 మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. జూన్‌ మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్‌ బీపాస్‌లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని చెప్పారు. టీఎస్‌ బీపాస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లో అనుమతులు పొందేందుకు వీలు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. 


logo