బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 20:50:04

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సిరిసిల్ల‌: టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల జిల్లాకు చెందిన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రానున్న వర్సాకాలంలో సీఎం కేసీఆర్ సూచించిన విధంగా పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 


logo