సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 13:58:05

భారీ వ‌ర్షాలు.. 2 వారాల పాటు సెల‌వులు ర‌ద్దు

భారీ వ‌ర్షాలు.. 2 వారాల పాటు సెల‌వులు ర‌ద్దు

హైద‌రాబాద్ : న‌గ‌రంతో పాటు మిగ‌తా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పుర‌పాల‌క‌, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ స‌హా అన్ని పుర‌పాలిక‌ల్లో ప్ర‌స్తుత ప‌‌రిస్థితుల‌పై కేటీఆర్ ఆరా తీశారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రానున్న 2 వారాల పాటు అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. నిరంత‌రం క్షేత్రంలో ఉంటూ ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సూచించారు. గ‌త 10 రోజుల్లోనే 54 సెం.మీ. భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తెలిపారు. భారీ వ‌ర్షంలోనూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌‌ని అధికారులు తెలిపారు. వ‌ర్షాల‌కు పాడైన రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని మంత్రి చెప్పారు. వ‌ర్షాలు త‌గ్గ‌గానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ప‌నులు మ‌రింత పెంచాల‌ని అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 


logo