గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 10:47:10

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీపై కేటీఆర్‌ సమావేశం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీపై కేటీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీలపై మంత్రివర్గ సహచరులతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. రెండు పాలసీల ముసాయిదాపై మంత్రులతో కేటీఆర్‌ చర్చించి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీపై కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై మంత్రివర్గం చర్చించనుంది. లంచ్‌ అనంతరం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల వరకు లాజిస్టిక్‌ పాలసీని మంత్రివర్గం ముందు కేటీఆర్‌ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం లాజిస్టిక్‌ పాలసీపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ - సహకార, పశుసంవర్ధక - మత్స్య, పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు.


logo