ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 12:55:16

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్‌ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా అప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి, సేవలందించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.  అలాగే మంత్రి భారీ వర్షాలకు ముంపునకు గురైన అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌ నాలాను పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా బాధితులను మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo