బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 13:22:47

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌ : ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతమైన చర్యలు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నూతన పురపాలక చట్టం విధివిధానాల మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, ప్రజలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పట్టణదారుల అవసరాల మేరకు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌, ఇన్‌ఫా విభాగాలకు కూడా  ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo