శనివారం 04 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 14:37:38

ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టండి: మంత్రి కేటీఆర్‌

ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టండి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: కార్పొరేషన్ల‌ పరిధిలో ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌  అన్నారు.  పారిశుద్ధ్య, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్ల  అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, గణేష్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి కృషి చేసిన‌ కరీంనగర్‌ జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.


'కార్పొరేషన్ల పరిధిలోని శ్శశాన వాటికలు, పార్కులు, జంక్షన్లు అభివృద్ధి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలి. కరీంనగర్‌, నిజామాబాద్‌ పట్టణాల వాటర్‌ మ్యాప్‌ని సిద్ధం చేయాలి. ఆధునిక స్లాటర్‌ హౌస్‌ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయాలి.  రెండు కార్పొరేషన్ల వాటర్‌, ఎనర్జీ ఆడిటింగ్‌ 15 రోజుల్లో పూర్తి చేయాలి.  రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని' మంత్రి పేర్కొన్నారు. 


logo