మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 17:39:02

పట్టణ ప్రగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

 పట్టణ ప్రగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్ :  పట్టణ ప్రగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌ర్డీలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పలు విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పట్టణాల మార్పే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైంది. పట్టణాల్లో గుణాత్మకమైన మార్పుకు పట్టణ ప్రగతి తొలి అడుగుగా భావిస్తున్నాం. పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలు గుర్తించినం.  నూతన పురపాలక చట్టంపై అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయవంతమైంది. పట్టణప్రగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు. గుర్తించిన సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలి.  పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా మర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 


logo
>>>>>>