గురువారం 04 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:32

చిన్నారులకు కేటీఆర్‌ భరోసా

చిన్నారులకు కేటీఆర్‌ భరోసా

  • ‘నమస్తే’ కథనానికి మంత్రి స్పందన
  • సాయం చేయాలని నల్లగొండ కలెక్టర్‌కు ఆదేశం

మర్రిగూడ: తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ, తాతయ్య వద్ద పెరుగుతున్న అన్నాచెల్లెళ్లకు ‘మేము న్నాం’ అని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘పాపం పసివాళ్లు’ శీర్షిక తో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ కల్లెట్ల అరుణ్‌ సాగర్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టుచేయగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘ఆ చిన్నారులకు మేమున్నాం’ అని ప్రకటించి.. తక్షణమే వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే అజ య్‌, అంజలిని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం అన్నాచెల్లెళ్లను బాలసంరక్షణ కేంద్రానికి తరలించి లాక్‌డౌన్‌ అనంతరం గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని కలెక్టర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి బాధితుల పూర్తి వివరాలు సేకరించారు. చిన్నారులు కోరినచోట చదివిస్తామని తాసిల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ చెప్పారు. శనివారం గ్రామానికి వెళ్లి చిన్నారుల పూర్తివివరాలను నమోదు చేసుకున్నారు. మొదటగా చిన్నారుల సంరక్షణ చర్యలు చేపడుతామన్నారు. 


logo