మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:02

మీరాచోప్రా ఫిర్యాదుపై చర్యలు

మీరాచోప్రా ఫిర్యాదుపై చర్యలు

  • డీజీపీ, సీపీకి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు కొందరు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సినీనటి మీరాచోప్రా చేసిన ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు శుక్రవారం ట్విట్టర్‌లో ఆదేశాలు జారీచేశారు. ఇటీవల ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ అభిమాని ఒకరు.. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలని మీరాచోప్రాను కోరారు. ఎన్టీఆర్‌ అభిమానిని కాదని మీరాచోప్రా బదులివ్వడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆమెను బెదిరిస్తూ ట్వీట్లు పెట్టారు. కొందరు తనపై యాసిడ్‌ దాడికి పాల్పడుతామని, గ్యాంగ్‌రేప్‌ చేస్తామని బెదిరిస్తున్నారని మీరాచోప్రా హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని శుక్రవారం మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కవితను ట్విట్టర్‌లో కోరారు. మంత్రి వెంటనే స్పందించి అధికారులను ఆదేశించడంపై మీరాచోప్రా కృతజ్ఞతలు తెలిపారు. 


logo