మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 14:43:21

కార్మికుల క‌నీస వేత‌నాలు త‌గ్గించ‌డంపై కేటీఆర్ అభ్యంత‌రం

కార్మికుల క‌నీస వేత‌నాలు త‌గ్గించ‌డంపై కేటీఆర్ అభ్యంత‌రం

హైద‌రాబాద్ : విదేశాల్లో ప‌ని చేసే కార్మికుల క‌నీస వేత‌నాలు త‌గ్గించ‌డంపై రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క‌నీస వేత‌నాలు 30 నుంచి 50 శాతం త‌గ్గించ‌డంపై అభ్యంత‌రం తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో కేంద్ర విదేశాంగ శాఖ‌ మంత్రి జైశంక‌ర్‌కు కేటీఆర్ విన్న‌పం చేశారు. క‌నీస వేత‌న ఒప్పందాల్లో కేంద్ర మార్పుల‌తో వ‌ల‌స కార్మికుల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో ప‌ని చేసే తెలంగాణ వ‌ల‌స కూలీల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌న్నారు. కొవిడ్‌, లాక్‌డౌన్ వ‌ల్ల వ‌ల‌స కూలీలు సంక్షోభంలో ఉన్నారు. వ‌ల‌స కూలీల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు కృషి చేయాల‌ని కేటీఆర్ కోరారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి
ఆస‌రా పెన్షన్లకు నిధుల‌ను విడుద‌ల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి