గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 11:17:21

కర్ణాటక హింస.. కేటీఆర్‌ అభ్యర్థన

కర్ణాటక హింస.. కేటీఆర్‌ అభ్యర్థన

హైదరాబాద్‌ : కర్ణాటకలోని డీజే హాళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింసపై తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో.. ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా యూజర్లందరూ బాధ్యాతయుతంగా మెలగాలని కేటీఆర్ అభ్య‌ర్థించారు. అనుచిత ప్రచారం చేయొద్దన్నారు. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తిని అరికట్టాలని మంత్రి కోరారు. సంఘ వ్యతిరేక కర్యకలాపాలకు పోషల్‌ మీడియా ఒక సాధనంగా మారొద్దు అని కేటీఆర్‌ సూచించారు. 

ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్‌.. ఓ వర్గాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో వివావాదస్పద పోస్టు పెట్టడంతో వివాదం రాజుకుంది. దీంతో ఆందోళనకారులు ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకుని విధ్వంసం సృష్టించారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. ఆందోళనకారుల దాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారు. దాడి ఘటనకు సంబంధించి 110 మందితో పాటు వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే బంధువు నవీన్‌ను కూడా అరెస్టు చేశామని సీపీ చెప్పారు. 

పరిస్థితి అదుపులో ఉంది

ప్రస్తుతం ఎమ్మెల్యే నివాసం పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ కమల్‌ పంత్‌ పేర్కొన్నారు. డీజే హళ్లి, కేజీ హళ్లిలో కర్ఫ్యూ అమల్లో ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.


logo