శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 19:30:51

అనాథలైన అక్కాచెల్లెళ్లు.. స్పందించిన మంత్రి కేటీఆర్‌

అనాథలైన అక్కాచెల్లెళ్లు.. స్పందించిన మంత్రి కేటీఆర్‌

నల్లగొండ : అనాథలైన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ వారి బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పోంగి ప్రవహించింది. వాగు దాటుతూ పెందోటి లక్షమ్మ అనే మహిళ ప్రవాహ ఉధృతికి తాళలేక వాగులో పడి చనిపోయింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త నర్సింహా మూడు రోజుల వ్యవధిలోనే ఉరేసుకుని చనిపోయాడు. స్వల్ప వ్యవధిలో ఇరువురి మృతి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన అక్కాచెల్లెళ్ల దీనస్థితి వివరిస్తూ అదే గ్రామానికి చెందిన పేలపోలు ప్రణయ్‌ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆదుకోవాల్సిందిగా కోరారు. స్పందించిన మంత్రి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను కోరారు.