ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 10:13:14

‘టీ‌శా‌ట్‌’కు మంత్రి కేటీ‌ఆర్‌ అభి‌నం‌ద‌నలు

‘టీ‌శా‌ట్‌’కు మంత్రి కేటీ‌ఆర్‌ అభి‌నం‌ద‌నలు

హైద‌రా‌బాద్ : టీశాట్ యాప్‌ 10 లక్షల మంది డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వడం హర్ష‌ణీ‌య‌మని ఐటీ శాఖ మంత్రి కేటీ‌ఆర్‌ పేర్కొ‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొవిడ్ స‌మ‌యంలో టీశాట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ విద్య‌ను విద్యార్థుల‌కు చేరువ చేయ‌డంలో టీశాట్ సిబ్బంది అద్భుతంగా ప‌ని చేసింద‌ని కొనియాడారు. నిన్న‌ మంత్రి కేటీ‌ఆ‌ర్‌ను క్యాంపు కార్యా‌ల‌యంలో ఐటీ శాఖ ముఖ్య కార్య‌దర్శి జయేశ్‌ రంజన్‌, టీసాట్‌ సీఈవో శైలే‌శ్‌‌రెడ్డి, డిజి‌టల్‌ మీడియా డైరె‌క్టర్‌ కొణతం దిలీప్‌ కలి‌శారు. పెద్ద సంఖ్యలో ప్రజ‌లకు చేరు‌వ‌య్యేం‌దుకు కృషి చేసి‌నం‌దుకు గాను మంత్రి కేటీ‌ఆర్‌ అభి‌నం‌దిం‌చారు. కొవిడ్‌ ప్రభావం వల్ల టీశాట్ నెట్‌‌వర్క్‌ విద్యా‌శా‌ఖకు ప్రత్యా‌మ్నా‌యంగా మారిం‌దని పేర్కొ‌న్నారు. ఈ సంద‌ర్భంగా శైలే‌శ్‌‌రెడ్డి మాట్లా‌డుతూ.. ఇకపై సన్‌‌డై‌రె‌క్ట్‌లో విద్య 195, నిపుణ 196 నంబర్‌ చాన‌ళ్లలో ప్రసా‌ర‌మ‌వు‌తా‌యని తెలి‌పారు.