e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ

యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ

యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ

హైద‌రాబాద్ : ఆ యువ గాయ‌ని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. త‌న స్వ‌రంతో కేటీఆర్‌నే కాదు.. ప్ర‌ముఖ మ్యూజిషీయ‌న్స్ దేవీ శ్రీప్ర‌సాద్‌, థ‌మ‌న్‌ను సైతం ఆక‌ట్టుకుంది. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.

సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ‌ర్వాణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని స్వ‌రం మైమ‌రిపించేలా ఉంది. ఆమె ట్యాలెంట్‌కు మీ స‌హ‌కారంతో పాటు మీ ఆశీస్సులు అవ‌స‌ర‌మ‌ని కేటీఆర్‌కు తిప్ప‌రాజు ట్వీట్ చేశారు. రేలా రే రేలా రే నీళ్ల‌ల్లో నిప్ప‌లే వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో నా తెలంగాణ అనే పాట‌ను శ‌ర్వాణి ఆల‌పించ‌గా.. ఆ వీడియోను కూడా తిప్ప‌రాజు ట్వీట్ చేశారు.

- Advertisement -

ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. శ‌ర్వాణిలో అద్భుత‌మైన ట్యాలెంట్ ఉందంటూ కేటీఆర్ ప్ర‌శంసించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థ‌మ‌న్, దేవీ శ్రీప్ర‌సాద్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు.
ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కూడా స్పందించారు.

శ‌ర్వాణి అద్భుత‌మైన గాయ‌ని అని థ‌మ‌న్ మెచ్చుకున్నారు. దేవీ శ్రీప్ర‌సాద్ స్పందిస్తూ నిజంగా ఆమె స్వ‌రం అద్భుతంగా ఉంది. ప్ర‌తిభావంతురాలిని త‌మ దృష్టికి తీసుకొచ్చినందుకు కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. శ‌ర్వాణి ట్యాలెంట్‌ను త‌ప్ప‌కుండా గౌర‌విస్తామ‌న్నారు. తాము భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే షోల‌లో శ‌ర్వాణికి త‌ప్ప‌కుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని దేవీ శ్రీప్ర‌సాద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ
యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ
యువ గాయ‌నిని మెచ్చుకున్న కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ

ట్రెండింగ్‌

Advertisement