బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:44:24

సభ.. సందడి

సభ.. సందడి
  • అసెంబ్లీ ఆవరణలో కోలాహలం
  • గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
  • మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం అసెంబ్లీ ఆవరణ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమరవీరులస్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడినుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు ఘనస్వాగతం పలికారు. 


అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రులు మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, చీఫ్‌ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్‌, బీ వెంకటేశ్వర్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. తొలిరోజు సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూట్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోట్‌ ధరించి వచ్చారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పంచె లాల్చితో సభకు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ కండువాలు వేసుకొని సభలో కూర్చున్నారు.logo
>>>>>>