శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 07:38:32

ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌ దంపతులు

ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌ దంపతులు

హైదరాబాద్‌ : నగర అభివృద్ధి కోసం ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఆయన సతీమణి శైలిమతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందీనగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లోని పోలింగ్‌బూత్‌-8లో తమ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని హైదరాబాద్‌ నగర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.logo