శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 10, 2020 , 13:23:00

ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి కేటీఆర్‌

ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్‌శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే 10 వారాల పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌శాఖ నిర్ణయించింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంది. పౌరులు తమ ఇళ్ల ప్రాంగణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ క్రమంలో భాగంగా మంత్రి నేడు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌ ప్రాంగణంలోని పూలకుండీలు, ఇతర చోట్ల నీటి నిల్వను పరిశీలించారు. పూలకుండిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటి పరిసరాలను శుభ్రపరిచారు. అదేవిధంగా యాంటీ లార్వా మందులు చల్లారు. వర్షాకాలం నాటికి సీజనల్‌  వ్యాధుల నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.


logo