శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 07, 2020 , 16:26:01

యూరోపియన్‌ రాయబారులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

యూరోపియన్‌ రాయబారులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌ : యూరప్‌ దేశాల రాయబారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. వివిధ దేశాల రాయబారులు, ప్రముఖ కంపెనీల సీనియర్‌ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 తదనంతరం పరిశ్రమలపై పడే ప్రభావం, భవిష్యత్‌ అవకాశాలపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని వివరించారు. రాష్ర్టాల్లోని అనుకూల పరిస్థితులను ప్రత్యేకంగా గమనించాలని కోరారు. తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా సులభతర వాణిజ్యంలో ప్రమాణాలు నెలకొల్పామన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామిక వర్గాలతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ ఇందు కోసం వివిధ దేశాల రాయబారుల సహాయాన్ని కోరారు.


logo