శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 12:07:25

ధ‌ర‌ణి పోర్ట‌ల్ కీల‌కం : మ‌ంత్రి కేటీఆర్

ధ‌ర‌ణి పోర్ట‌ల్ కీల‌కం : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : స‌మీకృత భూరికార్డుల నిర్వ‌హ‌ణ విధానంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ కీల‌క‌మ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ చిర‌స్థాయిగా నిలుస్తుంద‌న్నారు. అవినీతికి ఆస్కారం లేని పూర్తి పార‌ద‌ర్శ‌క విధానంలో లావాదేవీలు జ‌ర‌ప‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఈ విధానం ద్వారా ఏక‌కాలంలో రిజిస్ర్టేష‌న్లు, మ్యుటేష‌న్లు జ‌రుగుతాయ‌న్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శ‌కంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.