శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:06:39

అనాథలైన చిన్నారులకు అండగా మంత్రి కేటీఆర్

అనాథలైన చిన్నారులకు అండగా మంత్రి కేటీఆర్

యాదాద్రి భువనగిరి : ఏడాది క్రితం తల్లి.. నిన్న తండ్రి మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలైన విషాద ఘటన మోటకొండూర్ మండలం మాటూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భైరపాక నవీన్(30) హైదరాబాద్ ఉప్పల్ లో పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడు.

ఏడాది క్రితమే ఆయన భార్య రేణుక అనారోగ్యంతో మృతి చెందింది. కాగా, వారి సంతానం అస్మిక(9), హర్ష (7) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. దీంతో స్థానిక యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు మెసేజ్ పంపగా వెంటనే కేటీఆర్ స్పందించారు. చిన్నారుల పూర్తి వివరాలు పంపాల్సిందిగా రీ ట్వీట్ చేశారు. 

ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి స్పందించి చిన్నారుల బంధువులు ఒప్పుకుంటే వారి ఉన్నత చదువులకు పూర్తి భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. అమ్మ, నాన్న కోల్పోయి తండ్రి మృతదేహం వద్ద రోదిస్తున్నచిన్నారుల ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

logo