సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:44:52

పీవీ శతజయంతి వేడుక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

పీవీ శతజయంతి వేడుక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుక నిర్వహణ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ నేడు పరిశీలించారు. నగరంలోని పీవీ మెమోరియల్‌లో జరుగుతున్న పనులను, ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల వేగవంతానికి ఈ సందర్భంగా మంత్రి నిర్వాహాకులకు పలు సూచనలు చేశారు. ఈ 28న పీవీ జ్ఞానభూమిలో రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని పీవీ శతజయంతి కమిటీ వేడుక ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సేవలను గుర్తుంచుకునేలా, చిరస్మరణీయంగా నిలిచేలా శతజయంతి ఉత్సవాల నిర్వహణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిశ్చయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమైంది.logo