మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 15:57:52

రాష్ట్రాన్ని డిజిటలైజేషన్ వైపు నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

రాష్ట్రాన్ని డిజిటలైజేషన్ వైపు నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, డిజిటలైజేసణ్ వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు కృషి చేస్తున్న మంత్రి కే తారకరామారావు అభినందనీయులని కొనియాడారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. డిజిటల్ మాధ్యమం లేకపోవడం వల్ల ఏ పిల్లవాడు విద్యను కోల్పోకూడదని ఆయన అభిలాషించారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి టీవీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్య ప్రశంసనీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ ను అభినందిస్తున్నాం అని ట్విట్టర్ లో తెలిపారు.

అదేవిధంగా, కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కమ్యూనికేషన్ కోసం సమర్థంగా, సురక్షితంగా ఉండేలా ఈ-గవర్నెన్స్ కోసం సర్పంచ్‌లు డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించాలని కోరారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి టీవీలను అందించడానికి ఉపయోగించేలా సోమవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి చెక్కు అందజేశారు.logo