బుధవారం 24 ఫిబ్రవరి 2021
Telangana - Jan 20, 2021 , 08:51:11

నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ నేడు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో రూ.4.6 కోట్లతో నిర్మించనున్న వైకుంఠదామం పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.18 కోట్లకుపైగా నిధులతో చేపట్టిన అధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం 10.10 గంటలకు ఫతేనగర్‌లో రూ. 270.50 లక్షలతో నిర్మిస్తున్న నాలా విస్తరణ పనులకు, 10.20 గంటలకు కేపీహెచ్‌బీ కాలనీలోని బాలాజీనగర్‌లో రూ.155 లక్షలతో నాలా విస్తరణ పనులు, 10.30 గంటలకు బాలాజీనగర్‌లో రూ.కోటి వ్యయంతో ఇండోర్‌ షెటిల్‌కోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 

జేఎన్‌టీయూ మంజీరా మాల్‌ వద్ద రూ.48 లక్షలతో నిర్మించనున్న పార్క్‌ పనులను ఉదయం 10.40 గంటలకు ప్రారంభించనున్నారు. తర్వాత 10.50 గంటలకు కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో రూ. కోటి  వ్యయంతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను, 11 గంటలకు కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో రూ. 1.41 కోట్లతో చేపట్టిన నాలా విస్తరణ పనులను ప్రారంభిస్తారు. ఉదయం 11.20 గంటలకు అల్లాపూర్‌లో రూ.73లక్షలతో చేపట్టే నాలా విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

VIDEOS

logo